Nagababu : నిరుద్యోగులను మోసం చేశారంటూ వైసీపీ ప్రభుత్వం పై నాగబాబు సీరియస్..!!

జనసేన పార్టీ నేత నాగబాబు( Nagababu ) ట్విట్టర్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టడం జరిగింది.ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్( Job Calendar ) మరియు మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Maga DSC Notification ) ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారు అంటూ ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) ఫోటో పోస్ట్ చేశారు.

 Nagababu Is Serious About The Ycp Government For Cheating The Unemployed-TeluguStop.com

బీ ఎవేర్ ఆఫ్ బ్రష్టాచార్స్ అని అన్నారు.అంతకుముందు వయసు ఎక్కువ పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్ద వాళ్ళు అవుతారు.

అంటూ ఓ పోస్ట్ పెట్టడం జరిగింది.ఆ పోస్ట్ పైన గమనిక ఏం మాట్లాడినా మా గురించే ఏమో అని ఆపాదించుకుంటారు.

ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెబుతున్న తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం.అని నాగబాబు చేసిన ట్వీట్స్ ఏపీ రాజకీయాలు సంచలనంగా మారాయి.

2019 ఎన్నికలలో నరసాపురం పార్లమెంటు నుండి జనసేన పార్టీ( Janasena Party ) అభ్యర్థిగా నాగబాబు పోటీ చేసి ఓటమిపాలయ్యారు.2024 ఎన్నికల సమయానికి వచ్చేసరికి అనకాపల్లి నియోజకవర్గం నుండి నాగబాబు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.ఇదే సమయంలో ఆయన అనకాపల్లిలో ఓ పెద్ద భవనం అద్దెకు తీసుకుని అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఆఖరి నిమిషంలో అనకాపల్లి ఎంపీ సీటు( Anakapalli MP Seat ) జనసేన నుండి చేజారిపోయింది.

దీంతో నాగబాబు సైలెంట్ గా అనకాపల్లి నుండి దుకాణం మొత్తం హైదరాబాద్ మార్చేశారు.కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.కాగా ఆ తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో.జనసేన పోటీ చేసే స్థానాలలో భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధం కావడం జరిగింది.ఈ క్రమంలో వరుస పెట్టి జనసేన పార్టీ విభాగాలతో నాగబాబు సమావేశం అవుతూ ఎన్నికలలో ఏ రకంగా ముందుకెళ్లాలి అనే దానిపై సూచనలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube