Ruturaj Gaikwad : ఈ సీజన్ లో చెన్నై టీమ్ కి గైక్వాడ్ పేరుకే కేప్టెనా..? చెన్నై టీమ్ లో అసలేం జరుగుతుంది.?

ఐపీఎల్ సీజన్ 17( IPL 17 ) ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతి టీం కూడా వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు ఏంటి అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా టీమ్ లోకి ప్లేయర్లను తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తున్నాయి.ఇక అందులో భాగంగానే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) టీం కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని( Mahendra Singh Dhoni ) ఈ సీజన్ కి కెప్టెన్ గా తప్పుకోవడం తో ఋతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించినట్టుగా జట్టు యాజమాన్యం ప్రకటించింది.

 Dhoni Hands Over Chennai Super Kings Captaincy To Ruturaj Gaikwad Ahead Of Ipl-TeluguStop.com
Telugu Chennai, Cskruturaj, Dhoni, Ipl, Msdhoni, Ravindra Jadeja, Ruturaj Gaikwa

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లకు ధోని కెప్టెన్ గా ఉన్నాడు.ఇక ఇప్పుడు ఋతురాజు గైక్వాడ్ ను( Ruturaj Gaikwad ) కెప్టెన్ చేయడం వల్ల టీమ్ లో కొంతవరకు డిస్టబెన్స్ అయితే కలిగే అవకాశం ఉంది.ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి రవీంద్ర జడేజా ను( Ravindra Jadeja ) కెప్టెన్ గా చేసినప్పటికీ ఆయన పెద్దగా రాణించలేకపోయాడు.దాంతో మళ్లీ ధోనినే కెప్టెన్ గా చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా చేయడం వల్ల టీమ్ లో ఉన్న ఇబ్బందులను గుర్తించి వాటిని సక్రమమైన విధానంలో నడిపించే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక కొంతమంది సీనియర్ ప్లేయర్లు చెబుతున్న దాని ప్రకారం ఋతురాజ్ గైక్వాడ్ ధోని అండర్ లో ఈ సీజన్ కి కెప్టెన్ గా చేస్తాడు.

Telugu Chennai, Cskruturaj, Dhoni, Ipl, Msdhoni, Ravindra Jadeja, Ruturaj Gaikwa

ఇక నెక్స్ట్ సీజన్ నుంచి ధోని ఉండడు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా కెప్టెన్ గా కొనసాగుతాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అంటే ఇప్పుడు ఋతురాజ్ గైక్వాడ్ తీసుకునే ప్రతి డిసిజన్ వెనుక ధోని నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది…అంటే ధోని గైక్వాడ్ కి ఎలా కెప్టెన్సీ చేయాలో ఈ మ్యాచ్ లా ద్వారా నేర్పిస్తాడు అంటే ఈ సీజన్ లో గైక్వాడ్ పేరుకు మాత్రమే కెప్టెన్ అన్ని నిర్ణయాలు ధోనీనే తీసుకుంటాడు అని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube