మాములుగా సినిమాలకు, సీరియల్స్ కి మధ్య పోటీ నడుస్తూనే ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా ఆడవాళ్లు సీరియల్స్ కి అంకితం అయిపోయారు.
దాని వల్ల సినిమాలపై ప్రభావం పడుతోంది.సీరియల్స్ ని సినిమా ప్రమోషన్లలో వాడుకొంటున్న వైనం చూస్తూనే ఉన్నాం.
ఇటీవల కాలంలో ప్రేక్షకులు సీరియల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు.సీరియల్స్ కూడా గట్టి ప్రభావాన్నే చూపిస్తున్నాయి.
బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ లో నెంబర్ వన్ సీరియల్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్తీకదీపం.

చిన్నా పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సీరియల్ కి ఎడిక్ట్ అయిపోవడంతో పాటు ఈ సీరియల్ ని బాగా ఆదరించారు.ఈ సీరియల్ సాధించిన క్రేజ్ అంతా ఇంతా కాదు.వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ప్రతీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి.
అయితే గత ఏడాది కార్తీక దీపం ( Karthika Deepam )అయిపోయింది.ఇప్పుడు పార్ట్ 2 రాబోతోంది.
సీరియల్ పార్ట్ టు రావడం ఏంటి అని అనుకుంటున్నారా.అవునండోయ్ ఈ సీరియల్ కి అంత క్రేజ్ ఉంది మరి.ఈనెల 25 నుంచి కార్తీక దీపం 2 ప్రసారం కాబోతోంది.దీనికి సినిమా స్థాయిలో ప్రచారాన్ని కలిగిస్తోంది టీవీ యాజమాన్యం.
ఏకంగా ఈ సీరియల్ కి ప్రివ్యూలు, ప్రీమియర్లు ప్లాన్ చేస్తోంది.

గురువారం కార్తీక దీపం 2( Karthika Deepam 2 ) ప్రీమియర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.ఈ సీరియల్ లోని మొదటి భాగాన్ని ముందుగానే కొంతమంది కార్తీక దీపం అభిమానులకు చూపించబోతున్నారు.ఇన్నాళ్లూ సినిమాలకు ప్రీమియర్లు చూసాము.
కానీ బుల్లితెర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఒక సీరియల్ కు ప్రీమియర్( Preview show ) ఏర్పాటు చేయడం చూడబోతున్నాం.ఆ రకంగా కార్తీక దీపం రికార్డు సృష్టించిందనే అనుకోవాలి.
మరి కార్తీకదీపం 2 సీరియల్ ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.ఇప్పటికే ఈ సీరియల్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.