ఏపీలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఆవిష్కరించారు.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) దోపిడీని ఈ పుస్తకంలో వివరించారని ఆయన తెలిపారు.
చంద్రబాబు వ్యవస్థలను ఎలా మ్యానేజ్ చేశారో స్పష్టంగా రాశారని పేర్కొన్నారు.జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారన్న సజ్జల అధికారం కోసమే బీజేపీ( BJP ), పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని తెలిపారు.గతంలో చంద్రబాబును వద్దని ప్రజలు చెప్పారన్నారు.
కానీ ఏపీలో అరాచకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మరోసారి కూటమిగా ఏర్పడి చంద్రబాబు వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.







