ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu )తో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) భేటీ అయ్యారు.
హైదరాబాద్ లో సమావేశమైన ఇద్దరు నేతలు ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఈ సారి ఎన్నికలకు టీడీపీ -జనసేన మరియు బీజేపీ( BJP ) కలిసి సంయుక్తంగా బరిలో దిగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 26న నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనుండగా.ఈ నెల 27 నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారన్న సంగతి తెలిసిందే.







