Chiranjeevi : బయట సరదాగా కనిపించే చిరు ఇంట్లో అలా ఉంటారా.. చిరు అసలు రంగు ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Ramcharan Interesting Comments About Her Father Chiranjeevi-TeluguStop.com

ఇక చిరంజీవి బయటకు ఎక్కడికి వచ్చినా కూడా తాను ఒక స్టార్ హీరో అనే గర్వం లేకుండా ఎంతో సరదాగా అందరితో మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ జోకులు వేస్తూ ఉంటారు.ఇక ఈయన బయటకు వచ్చినప్పుడు చిన్న ఆర్టిస్టులతో కూడా చాలా సరదాగానే ఉంటారు.

Telugu Chiranjeevi, Ramcharan, Heroes, Tollywood-Movie

ఇలా చిరంజీవి గారు అంత పెద్ద హీరో అయినప్పటికీ ఇంత సరదాగా ఒక సామాన్య వ్యక్తుల ఉండటం ఎలా సాధ్యమవుతుందని చాలామంది సందేహాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.అయితే ఈయన బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఇలాగ ఉంటారా లేకపోతే ఇంట్లో కూడా ఇలాగే అందరితో సరదాగా జోక్స్ వేసుకుంటూ అందరిని నవ్విస్తూ ఉంటారా అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి.అయితే ఈ విషయం గురించి ఇటీవల మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ ( Ramcharan Tej ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Ramcharan, Heroes, Tollywood-Movie

నాన్న బయట ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం అలా కాదు.ఆయన ఇంట్లో చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటారని పెద్దగా జోక్స్ వేసి అందరినీ నవ్వించరని ఎవరైనా జోక్స్ వేసి నవ్విస్తే మాత్రం నవ్వుతూ ఉంటారని తెలిపారు.ఇక ఇంట్లో తాను మెగాస్టార్ అనే ఫీలింగ్ లో ఆయన ఉండరు.

ఒక సాధారణ భర్తలాగా ఒక సాధారణ తండ్రి లాగే ఉంటారని చరణ్ తెలిపారు.ఇక ఇంట్లో నాన్న ఎప్పుడూ డాన్సులు వేయడం చూడలేదు చిన్నప్పుడు మాకు ప్రాక్టీస్ చేయించేటప్పుడు చేశారు కానీ తర్వాత ఈయన ఇంట్లో డాన్స్ వేయడం కూడా చూడలేదని తెలిపారు.

అయితే నాన్న ఇలా ఉన్నప్పటికీ మేమంతా తనతో చాలా ఫ్రీగా ఉంటామని తెలిపారు.ఇక నాన్న మూడ్ పట్టి మేము ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడతామని, ఆయన బయట కనిపించే దానికి ఇంట్లో ఉండే దానికి పూర్తిగా భిన్నంగా ఉంటారని చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube