మామూలుగా అదృష్టం కలిసి రావడం అనేది అన్ని సార్లు జరగదు.కానీ నిర్మాత రామానాయుడు( Producer Ramanaidu ) మాత్రం అన్ని సర్దుకొని ఇక సినిమా తనకు పనికి రాదు అని నిర్ణయించుకుని ఊరెళ్ళిపోవాలని డిసైడ్ అయిన టైంలో అనుకోకుండా వచ్చిన ఒక అదృష్టం అతనిని ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్ గా ఎదగడానికి దోహదపడింది.
వాస్తవానికి రామానాయుడు అంతకు ముందే ఎన్నో రంగాల్లో వ్యాపారాలు చేసి నష్టపోయి చివరిగా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అడవి రాముడు( Adavi Ramudu Movie ) సినిమాతో ఎన్టీఆర్ హీరోగా మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తారు.తీసిన మొదటి సినిమా బాగానే వర్కౌట్ అయింది, కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు అతనిని నష్టాలు పాలు చేయడంతో సినిమా ఇండస్ట్రీ ఇక తనకు పనికి రాదు అని నిర్ణయానికి వచ్చారు.
ఆ టైంలో రామానాయుడు ప్రేమనగర్( Prema Nagar Movie ) అనే సినిమాతో టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.అయితే ఆ చిత్రం చేయాల్సింది మాత్రం ఆయన కాదు.
దాని వెనకాల చాలా విషయం జరిగింది.
నిజామాబాద్ కు చెందిన శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) అనే వ్యక్తి అప్పట్లో నవలలకు ఉన్న క్రేజ్ ని దృష్టి లో పెట్టుకొని కోడూరి కౌసల్యాదేవి( Koduri Kousalyadevi ) రాసిన ప్రేమనగర్ అనే ఒక నవలను సినిమాగా తీయాలని అనుకున్నారు.దాంతో ఈ విషయాన్ని అక్కినేని కి చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు.కె ఆర్ విజయను హీరోయిన్ గా పెట్టుకొని సినిమా కోసం బట్టల షాపింగ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి అతని భార్యతో కలిసి వెళుతున్న సమయంలో ఆక్సిడెంట్ కావడంతో అపశకునంగా భావించి ఆ సినిమా తీయకూడదని నిర్ణయించుకున్నారు.
దాంతో అక్కినేని( Akkineni ) రామానాయుడు కు విషయం చెప్పడంతో ఇక ఏదైతే అది జరిగింది.ఈ సినిమా ఎలా అయినా తీసేస్తాను.ఒకవేళ నష్టం వస్తే ఇద్దరు పిల్లలను హాస్టల్ లో వేసి నాకున్న 90 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను.అన్ని తేల్చుకున్నాకె ఇక్కడ నుంచి వెళ్తాను అని నిర్ణయం తీసుకొని శ్రీధర్ రెడ్డి దగ్గర అరవై వేలకు ఆ సినిమా రైట్స్ కొనుక్కున్నారు.
వాణిశ్రీ హీరోయిన్ గా అక్కినేని హీరోగా ఈ సినిమా 15 లక్షల రూపాయల్లో తెరకెక్కింది.నవయుగ ఫిలిమ్స్ వారు కూడా కొంత సహాయం చేశారు.అలాగే ప్యాలెస్ లాంటి ఒక సెట్ వేయడానికి 5 లక్షల రూపాయలు ఖర్చయింది.అప్పట్లో అదొక పెద్ద సంచలనం.34 ప్రింట్లతో కే ఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో ఈ సినిమా విడుదల కాగా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.భారీ వర్షాల్లో కూడా మంచి ఆదరణ సంపాదించి 50 లక్షలకు పైగా వసూలు చేసింది.
ఇదే సినిమాను తమిళ్లో మరియు హిందీలో కూడా ప్రకాష్ రావు దర్శకుడిగా, రామానాయుడు నిర్మాతగా రీమేక్ చేయగా సంచలన విజయాలను నమోదు చేసి రామానాయుడుని ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చేసింది.