ఇతరులకు సహాయం చేయాలంటే మంచి మనస్సు ఉండాలి.హైదరాబాద్ లోని చిల్కూరు ఆలయ పూజారిగా పని చేస్తున్న రంగరాజన్( Priest Rangarajan ) తాజాగా మంచి మనస్సును చాటుకున్నారు.
ఆపదలో ఉన్న ముస్లిం ఫ్యామిలీకి సహాయం చేసి రంగరాజన్ మంచి మనస్సును చాటుకున్నారు.చిలుకూరు గ్రామానికి చెందిన మొహమ్మద్ గౌస్( Mohammed Ghouse ) అనే వ్యక్తి కుటుంబానికి రంగరాజన్ అండగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు.
మొహమ్మద్ గౌస్ విద్యాదాఘాటంతో ఎద్దును కోల్పోగా ఈ విషయం తెలిసి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి రంగరాజన్ ముందుకొచ్చారు.ఇతరులకు సహాయం చేయడమే మానవత్వానికి అర్థం అంటూ తను చేసిన పని ద్వారా రంగరాజన్ ప్రూవ్ చేశారు.
ఆలయం తరపున రంగరాజన్ ఎద్దును( Bull ) బహుమతిగా ఇవ్వడం గమనార్హం.పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమంలో అందరూ మానవతావాదంతో పాల్గొనాలని రంగరాజన్ కామెంట్లు చేశారు.
గడిచిన రెండు సంవత్సరాలలో రైతుల పశువులు ఏ కారణం చైతనైనా మరణిస్తే గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో చిల్కూరు ఆలయ పుజారి( Chilkuru Temple Priest ) సహాయం చేశారు.తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది రైతులు రంగరాజన్ సహాయం పొందారు.కొంతమంది రైతులకు ఆవులను, మరి కొందరు రైతులకు ఎద్దులను రంగరాజన్ అందించడం గమనార్హం.ప్రజలు కూడా ఇదే విధంగా సహాయం చేయాలని ఆయన కోరుతున్నారు.
రంగరాజన్ కుల మతాలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ అంతకంతకూ ఎదుగుతున్నారు.రంగరాజన్ లా ఇతరులు కూడా తమ వంతు సహాయసహకారాలు అందిస్తే కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకునే అవకాశం ఉంటుంది.రంగరాజన్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని సమాచారం అందుతోంది.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిలుకూరు బాలాజీ ఆలయం( Chilkuru Balaji Temple ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ కు వెళ్లిన వాళ్లు ఈ ఆలయంను కచ్చితంగా దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.