తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తనకంటూ ఒక సపరేటు గుర్తింపును సంపాదించుకున్నాడు.ఆయన చేసిన మొదటి సినిమా నుంచి త్రీబుల్ ఆర్ సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసి మెప్పించి ప్రేక్షకులు అందరి చేత సుభాష్ అనిపించుకున్నాడు.
అలాంటి రాజమౌళిని చిరంజీవి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయమని అడగగా రాజమౌళి మొదటి సినిమా ఎవరితోనైనా చేయించండి.రెండో సినిమా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పాడట.
ఇక అందులో భాగంగానే మొదట చిరుత సినిమా చేశాడు.ఆ తర్వాత రాజమౌళి రామ్ చరణ్ ను పెట్టి మగధీర సినిమా చేశాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసిందనే చెప్పాలి.ఇక రాజమౌళి లాంటి దమ్మున్న దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.అయితే ఈ సినిమాని తీయాలని ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రాజమౌళిని పట్టు పట్టి మరి చేశాడట.అయితే తన కొడుకు అయిన అల్లు అర్జున్ కూడా అదే టైంలో హీరోగా ఎదుగుతున్నాడు కదా మరి తన కొడుకును కాదని రామ్ చరణ్ తో ఈ సినిమా చేయడానికి గల కారణం ఏంటి అంటూ అల్లు అరవింద్ మీద కొన్ని కామెంట్లు అయితే చేశారు.
ఇక దానికి అప్పుడు అల్లు అరవింద్ ఏ రకంగాను స్పందించలేదు.
కానీ మగధీర సినిమా రామ్ చరణ్ తో చేయడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం చాలా సందర్భాల్లో తెలియజేశాడు.చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నా అల్లుడు ని ఒక వారియర్ గా చూడాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా కోసం ఎన్ని డబ్బులు అయిన సరే పెడతానని రాజమౌళికి చెప్పానని అందుకోసమే అప్పు తెచ్చి మరి డబ్బులు పెట్టానని అల్లు అరవింద్ చెప్పడం విశేషం…
.