Pithecellobium Dulce Bean : ఎండాకాలంలో లభించే చీమ చింతకాయలు.. తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో( Summer ) ఎన్నో రకాల పండ్లు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే వేసవి కాలంలో మామిడి పండ్లు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి.

 Various Health Benefits Of Taking Pithecellobium Dulce Bean In Summer-TeluguStop.com

అలాగే కొన్ని శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలు కూడా వేసవికాలంలో లభిస్తాయి.వేసవి కాలంలో ముఖ్యంగా చీమ చింతకాయలు, ముంజకాయలు కూడా లభిస్తాయి.

ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఒగరు రుచితో కొన్ని,మరి కొన్ని తీపి రుచితో కూడా ఉంటాయి.

అయితే తీపి చీమ చింతకాయలు( Pithecellobium Dulce Bean ) తినాలని చెబుతున్నారు.చీమచింత కాయల లోపల గింజలు తినకూడదు.

ఈ చీమ చింతకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Diabetic, Benefits, Immunity, Memory-Telugu Health

అలాగే చీమ చింతకాయలు తింటే శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తి( Immunity Power ) లభిస్తుంది.అలాగే వీటిలో ఉండే విటమిన్ ఏ, బి, సి లతో పాటు మెగ్నీషియం, ఐరన్ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ఇంకా చెప్పాలంటే జ్ఞాపక శక్తి పెంచి ఏకాగ్రతను కలిగించే గుణం ఇందులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చీమ చింతకాయలను డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు( Diabetic Patients ) కూడా తగు మోతాదులో తీసుకోవచ్చు.అలాగే బరువు తగ్గాలనుకునే వారికి చిమ చింత కాయాలు మంచి ఆహారమని చెప్పవచ్చు.

మానసిక ఒత్తిడితో బాధపడే వారికి చీమ చింతకాయలు ఔషధంగా పని చేస్తాయి.

Telugu Diabetic, Benefits, Immunity, Memory-Telugu Health

అలాగే చీమ చింతకాయలలో క్యాల్షియం నిల్వ ఉన్నా కారణంగా ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే వీటిని మోతాదుకి మించి తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే గర్భిణీలు, బాలింతలు వీటిని తినకుండా ఉండడమే మంచిది.

అలాగే ఓగరుగా ఉండే చీమ చింతకాయలు తింటే గొంతు సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి వీటిని తగిన మోతాదు లో తినడమే మంచిది.ఏ ఆహార పదార్థాలమైన మోతాదుకు మించి తీసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube