రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్, హరిదాస్ నగర్ గ్రామాల రెడ్డి సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆల్మాస్ పూర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉచ్చిడి శ్రీనివాస్ రెడ్డి, హారిదాస్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆరుట్ల రామ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఎడ్ల నుంచి ఎదురుచూస్తున్న రెడ్డి కార్పొరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు, 20 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసి రెడ్డి కార్పొరేషన్ కొరకు వేములవాడ నుండి 2017 లో రెడ్డి పోరు యాత్ర- పాదయాత్ర ఎల్లారెడ్డిపేట మీదుగా
కామారెడ్డి మేడ్చల్ వరకు ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ తరలివెళ్లడం జరిగిందని వారు గుర్తుచేశారు.
రెడ్డి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అల్మాస్పూర్ లో రెడ్డి సంఘం ప్రతినిధులు నాగేల్లి వెంకట్ రెడ్డి ,కమలాకర్ రెడ్డి తిరుపతిరెడ్డి , మాజీ సర్పంచ్ ఓరుగంటి అనంతరెడ్డి , తడకమడ్ల అనంతరెడ్డి , హరిదాస్ నగర్ లో రెడ్డి సంఘం ప్రతినిధులు కుంభాల మల్లారెడ్డి వెంకట రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.