అమెరికాలోని సిలికాన్ వ్యాలీ( Silicon Valley )కి చెందిన భారతీయ అమెరికన్ సాంకేతిక నిపుణుల బృందం భారత్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.దైవిక ఆశీర్వాదాలను కోరుతూ స్థానిక ఆలయంలో ‘హవాన్’( Havan ) అనే ప్రత్యేక క్రతువును నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ‘‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్‌బీజేపీ) యూఎస్ఏ, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా చాప్టర్ నిర్వహించింది.ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.ప్రధాని మోడీ నాయకత్వంలో నిరంతర పురోగతి, పాలనా సంస్కరణల ఆశలను ప్రతిబింబిస్తుందని ఓఎఫ్‌బీజేపీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

నిర్వాహకులు ‘‘అబ్ కి బార్, 400 పార్ ’’( Abki Baar ,400 Paar ) (ఈసారి 400కు పైగా సీట్లు) అనే నినాదాన్ని ప్రతిధ్వనించారు.బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) 545 స్థానాలకు గాను 400 సీట్లకు పైగా సాధించాలనే మోడీ లక్ష్యాన్ని ఇది సూచిస్తుంది.భారత్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్నప్పుడు సిలికాన్ వ్యాలీలోని టెక్నాలజీ హబ్‌లో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో మోడీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ర్యాలీ చేస్తోంది.
ఇదిలావుండగా.2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh ) , సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది.
ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 26, జూన్ 1న పోలింగ్ జరగనుండగా.జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో మే 13న జరగనుంది.ఎన్నికల ప్రక్రియకు నగారా మోగడంతో అన్ని పార్టీలు కార్యకలాపాలను వేగవంతం చేశాయి.






