California Toilet Paper Rolls : కాలిఫోర్నియా రోడ్డుపై కుప్పలుగా పడిపోయిన టాయిలెట్ పేపర్లు.. వీడియో వైరల్..

ఇటీవల కాలిఫోర్నియా రాష్ట్రం,( California ) న్యూహాల్ కమ్యూనిటీలోని ఐదు లేన్ల రహదారిపై వెళ్తున్న డ్రైవర్లకు ఒక షాకింగ్ అనుభవం ఎదురయింది.అదేంటంటే, ఆ బిజీ రోడ్డుపై టాయిలెట్ పేపర్లు( Toilet Papers ) కుప్పలుగా పడిపోయాయి.

 Hundreds Of Toilet Paper Rolls Blocks California Highway Video Viral-TeluguStop.com

ఫోర్డ్ F-350 అనే ఒక ట్రక్కు నుంచి ప్రమాదవశాత్తు టాయిలెట్ పేపర్ రోల్స్‌తో కూడిన సరుకు రోడ్డుపై పడిపోయింది.ఈ సంఘటన ఇటీవల జరగగా దీని గురించి న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

అదృష్టవశాత్తూ, ఈ టాయిలెట్ పేపర్ల వల్ల ఎవరికీ హాని జరగలేదు.ట్రక్కు( Truck ) నుంచి మొత్తం మూడు పెద్ద పెట్టెలు మాత్రమే పడిపోయాయి, మొత్తం లోడ్ కాదు.

కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ ఈ పేపర్లను శుభ్రం చేయడానికి చాలా సమయం తీసుకుంది.ఆ సమయంలో రెండు లేన్లలో ట్రాఫిక్‌ను ఆపవలసి వచ్చింది.నిజానికి ఇది చాలా బిజీ రోడ్డు.ఐదు నిమిషాలు ఆటంకం కలిగినా చాలామంది ఇబ్బంది పడతారు.

అలాంటిది దాదాపు 20 నిమిషాల్లో రోడ్డును క్లియర్ చేయడానికి పోలీసులు ట్రాఫిక్‌ను ఆపారు.

డ్రోన్ తీసిన వీడియోలో నలుగురు పోలీసు అధికారులు టాయిలెట్ పేపర్ రోల్స్‌ను( Toilet Paper Rolls ) త్వరగా సేకరిస్తున్నట్లు కనిపించింది.రోల్స్ అన్ ఫోల్డ్ అయి మరింత గందరగోళాన్ని సృష్టించకుండా నిరోధించడానికి వారు వేగంగా పనిచేశారు.డ్రైవర్లను సురక్షితంగా ఉంచడానికి, అధికారులు పెట్రోలింగ్ కార్లను ఉపయోగించి ప్రభావిత దారులను అడ్డుకున్నారు.

ఈ టాయిలెట్ పేపర్లు రోడ్డుపై పడిపోవడానికి గల కారణాలు, ట్రక్కు డ్రైవర్ గుర్తింపు తెలియరాలేదు.ఈ వీడియోను అలెక్స్ కొరడెట్టి అనే న్యూస్ యాంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

వీడియోపై కామెంట్లు చేసిన వ్యక్తులు కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ రోజుల జ్ఞాపకాలను తీసుకువచ్చారు.అప్పట్లో, టాయిలెట్ పేపర్‌కు చాలా డిమాండ్ ఉంది, ప్రజలు దానిని నిల్వచేసేవారని అని గుర్తు చేసుకున్నారు.కొన్నేళ్ల ముందే ఇలా జరిగి ఉంటే ఆ టాయిలెట్ పేపర్లను ప్రజల ఎత్తుకుపోయి ఉండేవారని సరదాగా కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube