Shriya Sharma : అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు లాయర్.. ఈ యువతి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) విజయ భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జై చిరంజీవ( Jai Chiranjeeva ) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయినా ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలి పాత్రలో శ్రియా శర్మ( Shriya Sharma ) నటించారు.

 Jai Chiranjeeva Movie Child Artist Shriya Sharma Success Story Details-TeluguStop.com

సినిమాలో శ్రియా శర్మ కనిపించేది కొన్ని నిమిషాలే అయినా చిన్నారి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా తర్వాత శ్రియా శర్మ సూర్య, జ్యోతిక కాంబోలో తెరకెక్కిన నువ్వు నేను ప్రేమ సినిమాలో సైతం నటించారు.

ఇతర భాషల్లో సైతం బాలనటిగా ( Child Artist ) నటించిన శ్రియా శర్మకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చిల్లర్ పార్టీ సినిమాలో శ్రియా శర్మ అద్భుతమైన నటనకు చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ వచ్చింది.

దూకుడు సినిమాలో సమంత చెల్లెలి రోల్ లో నటించిన శ్రియా శర్మ పలు సినిమాలలో టీనేజ్ గర్ల్ గా నటించారు.

Telugu Childartist, Chiranjeevi, Story, Jaichiranjeeva, Jai Chiranjeeva, Nirmala

నిర్మలా కాన్వెంట్( Nirmala Convent ) సినిమాలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు.ప్రస్తుతం శ్రియా శర్మ వయస్సు 26 సంవత్సరాలు కాగా ఇప్పుడు శ్రియా శర్మ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు లాయర్ గా( Lawyer ) పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.ఇన్ స్టాగ్రామ్ లో శ్రియా శర్మకు ఏకంగా 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

సినిమాలు, యాడ్స్ లో నటిస్తూ కెరీర్ పరంగా సక్సెస్ కావడం సులువు కాదు.

Telugu Childartist, Chiranjeevi, Story, Jaichiranjeeva, Jai Chiranjeeva, Nirmala

శ్రియా శర్మ సక్సెస్ స్టోరీ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ చేస్తుండటం గమనార్హం.శ్రియా శర్మను నెటిజన్లు ఎంతగానో అభిమానిస్తున్నారు.శ్రియా శర్మ భవిష్యత్తులో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని తెలుస్తోంది.

గతంతో పోల్చి చూస్తే ఆమె లుక్స్ పూర్తిగా మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube