ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది.ఏఐసీసీ కార్యాలయంలో( AICC office ) జరగనున్న ఈ సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టోతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
అదేవిధంగా ఎన్నికల ప్రచారంపై ఏఐసీసీ నేతలు చర్చించనున్నారు.కాంగ్రెస్ ముసాయిదా మ్యానిఫెస్టోకి( Congress Draft Manifesto ) సీడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది.
మోదీ ( Modi )గ్యారెంటీకి ధీటుగా ఐదు న్యాయ గ్యారెంటీలను కాంగ్రెస్ తీసుకురానుందని తెలుస్తోంది.అలాగే లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ఖరారు చేయనుంది.