Singer Mangli : పుకార్లను నమ్మొద్దు.. కారు ప్రమాద ఘటనపై సింగర్ మంగ్లీ పోస్ట్?

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ మంగ్లీ( Singer Mangli ) ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.రంగారెడ్డి జిల్లా నందిగామలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది.

 Singer Mangli Reaction To Accident Rumors-TeluguStop.com

ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా శంషాబాద్ మండలం తొండుపల్లి బ్రిడ్జి వద్ద డీసీఎం వాహనం మంగ్లీ కారును వెనుక నుంచి ఢీ కొట్టింది.దీంతో మంగ్లీ కారు వెనుక భాగం మొత్తం డామేజ్ అయింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో సింగర్ మంగ్లీ తో పాటు మరో ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు ఈ ప్రమాద ఘటనలో( Car Accident ) భాగంగా మంగ్లీ గాయాలు పాలయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇక ఈ ప్రమాదం జరగడానికి కారణం డీసీఎం వాహనం డ్రైవర్ మద్యం తాగి నిద్రమత్తులో ఉండటంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.అయితే ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ఈ ప్రమాద ఘటన గురించి సోషల్ మీడియా( Social Media )లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంగ్లీ ఈ ప్రమాద ఘటన గురించి స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.డియర్ ఆల్… నేను క్షేమంగా ఉన్నాను.నాకు ఏం కాలేదు.

ఇటీవల అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగింది.ప్రచారం అవుతున్న పుకార్లను( Rumors ) నమ్మవద్దు.

మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు ఇట్లు మీ మంగ్లీ అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.ఇక ఈమె ఈ పోస్ట్ చేయడంతో ఈమెకు పెద్దగా గాయాలు ఏమీ తగలలేదని స్వల్పగాయలు తగిలాయని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube