Chandrababu EC Notices : చంద్రబాబుకు ఈసీ నోటీసులు..!!

వైసీపీ ఫిర్యాదు మేరకు చంద్రబాబుకు( Chandrababu ) ఈసీ నోటీసులు( EC Notices ) జారీ చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై( CM Jagan Mohan Reddy ) తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అభ్యంతరకర పోస్టులు చేస్తుందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి( MLC Appireddy ) ఫిర్యాదు చేశారు.

 Chandrababu Ec Notices : చంద్రబాబుకు ఈసీ నోట�-TeluguStop.com

ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా జగన్ వ్యక్తిత్వం పై దాడి చేసే విధంగా ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.24 గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న పోలింగ్ జూన్ 4వ తారీఖు ఫలితాలు విడుదల.ఎన్నికలకు సరిగ్గా ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.

దీంతో ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ గట్టిగా జరుగుతుంది.ఏదో రకంగా ప్రజల మన్ననలు పొందుకోవాలని పలు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు.2019 కంటే 2024 ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది.ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది.తెలుగుదేశం.జనసేన.బీజేపీ పార్టీలు మూడు కూటమిగా ఏర్పడ్డాయి.2014లో మాదిరిగానే 2024లో పరిస్థితి కనిపిస్తుంది.మరి ఏపీ ప్రజలు ఈ ఎన్నికలలో ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube