రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానంపై పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి.ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) స్థానాన్ని టీడీపీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో రెండు లోక్ సభా స్థానాలను బీజేపీ పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెండింగ్ లో పెట్టిన ఖమ్మం స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు తమ పార్టీకి కేటాయించాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు( Chandrababu ) ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.అయితే తెలంగాణలో టీడీపీకి సీటు కేటాయించడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఖమ్మం స్థానాన్ని బీజేపీ ఎవరికీ కేటాయిస్తుందోనన్న వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.