టాలీవుడ్ సినిమాలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి.ఈయన కేవలం హీరోలతోనే మాత్రమే కాకుండా.
ఎలాంటి కంటెంట్ అయినా సరే సినిమా రూపంలో తీసి ప్రేక్షకులను మెప్పించడం ఆయన నేర్పరి.దీనికి కారణం ఈగ సినిమా అని చెప్పవచ్చు.
ఆ సినిమాలో అనేక రకాల టెక్నాలజీలను ఉపయోగించి ఈగను సిల్వర్ స్క్రీన్ పై చూపించి సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే.

అయితే అది సినిమా కాకపోతే.ఇప్పుడు నిజ జీవితంలో ఓ ఘనుడు ఈగకు( fly ) ట్రైనింగ్ ఇచ్చాడు.అన్ని తెలిసిన మనిషికి ట్రైనింగ్ ఇచ్చి పని చేయించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కాస్త కష్టమైన సరే కుక్కలు, పిల్లులు, కొన్ని రకాల పక్షులకు ట్రైనింగ్ ఇవ్వచ్చు.కాకపోతే ముట్టుకోవడానికి ప్రయత్నిస్తేనే ఎగిరిపోయే ఈగకు ట్రైనింగ్ ఇచ్చాడు అంటే ఆ మనిషి ఎంత ఘనుడు ఒకసారి ఆలోచించండి.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మాత్రం ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేరు.ఈ వీడియోలో గమనిస్తే.మొదటిగా ఆ వ్యక్తి తన వేలిని ఒక వైపు నుండి మరొకవైపుకు కదిలిస్తుండగా., అదే మాదిరి ఈగ కూడా తన చేతి వేలు అనుసరించి అదే వైపుగా ఎగురుకుంటూ వస్తుంది.
అంతేకాదండోయ్.ఓ తేలికపాటి నాణ్యాన్ని నిలబెట్టగా ఈగ ఆ నాణెమును దొర్లించుకుంటూ ముందుకు వెళుతుంది.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే తాము చూస్తున్నది నిజమేనా.
, లేక కొత్త టెక్నాలజీ ఏఐ ను ఉపయోగించి వీడియోను రూపొందించారా అంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే అసలు ఇలాంటివి సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి చూసేయండి.







