ప్రపంచంలో లగ్జరీ బ్రాండ్ల ఫోన్ల విషయానికొస్తే ఆపిల్ ఫోన్( Apple phone ) మొదటగా నిలుస్తుంది.డబ్బులు ఎంతైనా కానీ ఈ మొబైల్ ను కొనుగోలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.
ముఖ్యంగా ఈ ఫోన్ సంబంధించి కొత్త వేరియంట్ మార్కెట్లోకి విడుదలవుతుంటే వాటి కోసం పెద్ద ఎత్తున ఆపిల్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు.నిజానికి ఈ ఫోన్ మిగితా ఫోన్ల కంటే చాలా ధర ఎక్కువ.
అయినప్పటికీ ప్రజలు వీటిని ఇష్టపడతారు.దీనికి కారణం లేకపోలేదు.
ఈ ఫోన్ అందించే సెక్యూరిటీ, అనేక వైవిధ్యమైన ఆప్షన్లు, కెమెరా క్లారిటీ లాంటివి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

ఇక ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ 512 జీబీ( Apple iPhone 15 Pro Max 512 GB ) తో ఉండే మోడల్ ధర మార్కెట్లో రూ.1,79,900 గా ఉండగా.ఈ ఫోన్ కి మూడింతలు ధర ఉన్న మొబైల్ కూడా ఉందంటే మీరు నమ్ముతారా.? కాకపోతే మీరు నమ్మాల్సిందే.ఎందుకంటే ఆరు లక్షలకు పైగా కెవియర్ ఫోన్లను అందిస్తోంది.

కెవియర్ సంస్థ పూర్తిగా కష్టమైజ్ ఫోన్లను తయారు చేసి ఇస్తుంది.ఈ కంపెనీ కేవలం బంగారం లేదా వజ్రాలు లాంటి ఆభరణాలను ఉపయోగించి ప్రీమియం స్మార్ట్ఫోన్లను వినియోగదారుల రుచికి అనుగుణంగా కష్టమైజ్ చేసి ఇస్తుంది.ఇందులో భాగంగానే ఐఫోన్ 15 ప్రో ను కొత్తగా మేక్ ఓవర్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది.ఇక ఈ ఫోన్ ధర చూస్తే.8060 డాలర్లుగా ఉంది.అంటే మన భారతదేశ కరెన్సీలో దాదాపుగా రూ.6,68,000.ఈ కంపెనీ కేవలం ఐఫోన్ మొబైల్ తో మాత్రమే ఆగిపోలేదు.
ముందుముందు కాలంలో కూడా కస్టమర్ల రుచిని ఆ అనుసరిస్తూ వేరే వేరే కూడా కష్టమైజ్ చేసి ఇచ్చే ఆలోచనలో ఉంది.







