పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలను బహిష్కరించిన కోనపాపపేట గ్రామస్థులు..!!

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కోనపాపపేటలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపిస్తున్న కోనపాపపేట గ్రామస్థులు ఎన్నికల బహిష్కరణకు సిద్ధం అయ్యారు.

 Villagers Of Konapapapet Boycotted Elections In Pitapuram Constituency..!!-TeluguStop.com

ఈ మేరకు ఎలక్షన్స్ బహిష్కరిస్తామని మత్స్యకారులు అల్టిమేటం ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు కేఎస్ఈజెడ్ లో లైపిజ్ ఫార్మా కంపెనీ సముద్రంలోకి వేసిన పైపులైనును వెంటనే తొలగించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

పైపులైన్లు సముద్రంలో మునిగి ఉండేందుకు చుట్టూ సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశారని, వాటి కారణంగా తమ వలలు తెగిపోతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు.ఈ క్రమంలోనే పైప్ లైన్లు తొలగించాలని గత మూడు నెలలుగా నిరసన చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube