ఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ.అంటే బహుశా గుర్తుపట్టకపోవచ్చు.
కేవలం ‘ ఓర్రీ ‘( Orry ) అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు సోషల్ మీడియా జనాలు.నిజానికి సోషల్ మీడియాలో ఇతను ఓ సంచలనం అని చెప్పవచ్చు.
ఎప్పటికప్పుడు డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లతో., బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు.నిజానికి ఈయన ఎలాంటి వెబ్ సిరీస్, సీరియల్స్ సినిమాలు ఇలా ఎక్కడ కూడా నటించలేదు.అయినా కానీ బాలీవుడ్ లో( Bollywood ) ఉన్న అందరి హీరో హీరోయిన్స్ కు ఇతడు పరిచయమే అని చెప్పవచ్చు.
అంతేకాదండి ఈయనను చూస్తే హీరో హీరోయిన్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తారట.బాలీవుడ్ లో నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 17 సీజన్ లో( Bigg Boss 17 ) ఈయన మూడు రోజులు అతిథిగా వ్యవహరించి సందడి చేశాడు.

ఈ కార్యక్రమంలో భాగంగానే అతనికి ఐదు మంది మేనేజర్స్ ఉంటారని వారు తన పనులు చక్కబెడుతుంటారని చెప్పడంతో చాలామంది షాక్ అయ్యారు.ఇకపోతే తాజాగా రాధిక మర్చంట్,( Radhika Merchant ) అనంత్ అంబానీ( Anant Ambani ) ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా ఈయన తలుక్కున మెరిశాడు.ఈ పెళ్లి వేడుకలు బాలీవుడ్ యాక్టర్స్ తో నానా హంగామా చేశాడు.ఇందులో హాలీవుడ్ అగ్ర నటుడు లో ఒకడైన రణ్ బీర్ కపూర్ తో( Ranbir Kapoor ) కలిసి మాట్లాడిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకీ ఇతను ఏం చేస్తాడు ఎలా సంపాదిస్తాడు అన్న ఆలోచన మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది.అయితే ఇటీవల ఫోర్స్ ఇండియాతో అతడు మాట్లాడిన కొన్ని విషయాలను ఓసారి చూస్తే.

తాను ఈవెంట్స్ లో పాల్గొని ప్రజలకు సంతోషాన్ని పంచడమే తన పని అంటూ తెలియజేశాడు.నేను ఎక్కడున్నా ప్రజల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తానని తెలియజేశాడు.ప్రస్తుతానికి అదే నా జీవనోదారణ అంటూ తెలిపారు.బడ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల పార్టీలకు పెళ్లిళ్లకు తాను హాజరైనందుకు ఏకంగా 15 లక్షల నుండి 30 లక్షల వరకు వారు చెల్లిస్తారని తెలియజేశారు.
ఇకపోతే తాను కార్యక్రమాల్లో ఒక అతిథిగా కాకుండా అందరిలో కలిసిపోయే స్నేహితుడిగా అలాగే వధువు లేదా వరుడికి తరపున హాజరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు.ఇందుకు సంబంధించి ఆయన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ముఖ్యంగా తను అనేకమంది బాలీవుడ్ నటుల, వారి ఫోటోగ్రాఫర్స్ యొక్క సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతానని., వారు తన ఫోటోలు షేర్ చేసినప్పుడు వచ్చే కామెంట్స్ కూడా చదువుతానని తెలిపారు.
అయితే తాను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







