టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటి వరకు మయో సైటిస్( Myositis ) కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే మంచి సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే తాజాగా న్యూదిల్లీ వేదికగా జరిగిన ఇండియాటుడే కాన్‌క్లేవ్ 2024 లో( India Today Conclave 2024 ) ఆమె పాల్గొన్నారు.
తన కెరీర్, మయోసైటిస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పరిస్థితుల కారణంగానే మయోసైటిస్ ఉందనే విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందని అన్నారు సామ్.అయితే నటిగా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 14 ఏళ్లు అయ్యింది.ప్రతిరోజూ 10 రకాల పనులు చేసేదాన్ని.
ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని.నా శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు.
నిజం చెప్పాలంటే, ఆ పద్నాలుగు ఏళ్లలో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి.ఇంపోస్టర్ సిండ్రోమ్ తో ( Imposter Syndrome ) ఇబ్బంది పడిన క్షణాలు ఉన్నాయి.
ఏదో ఒకరోజు నా నుంచి ఇది దూరమైపోతుందని భయపడేదాన్ని.ఈ సిండ్రోమ్ కారణంగా కెరీర్ అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయాను.
విజయం సాధించినా అది నా వల్ల వచ్చింది కాదని.వేరేవారి వల్ల వచ్చిందని భావించేదాన్ని అని సమంత తెలిపింది.మయోసైటిస్ కారణంగా గతంలో తాను నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని అప్పట్లో ఎన్నో వదంతులు వచ్చాయని అన్నారు సామ్.సమంత చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో( Kushi Movie ) నటించిన విషయం తెలిసిందే.
ఖుషిలో విజయ్ దేవరకొండతో కలసి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ పండించింది.అయితే పూర్తి స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.మయోసైటిస్ కారణంగా సమంత పూర్తి స్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.
దీనితో సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు.ప్రస్తుతం సినిమాలలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది సమంత.