మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నిహారిక తాజాగా రెండో పెళ్లి గురించి, పిల్లల గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే నిహారిక రెండో పెళ్లి కామెంట్లక్ నెటిజన్లు, అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.అదే సమయంలో రాడిసన్ బ్లూ కేసులో అన్యాయంగా ఇరికించారని నిహారిక ఆవేదన వ్యక్తం చేశారు.
నేను పార్టీలకు, పబ్బులకు అరుదుగా వెళ్తానని ఆమె పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ పబ్( Radisson Blu Pub ) లో నేను నా స్కూల్ ఫ్రెండ్స్ ను కలిశానని ఆరు నెలల తర్వాత వాళ్లను కలిసి కబుర్లు చెప్పుకున్నామని నిహారిక తెలిపారు.
అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు.బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చారని మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని నిహారిక కామెంట్లు చేశారు.
నాకు ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదని మీడియాలో ఎందుకంత రచ్చ చేశారో కూడా అర్థం కాలేదని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో నాకు చాలా బాధేసిందని నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలుసుకున్నానని నిహారిక వెల్లడించారు. నిహారిక రెండో పెళ్లి( Niharika Second Marriage ) విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రెండో పెళ్లి తర్వాత మరింత సంతోషంగా నిహారిక జీవనం సాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు, చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నిహారిక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది.నిహారిక కెరీర్ ప్లానింగ్ మాత్రం అదుర్స్ అనేలా ఉందని తెలుస్తోంది.నిహారిక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ సపోర్ట్ ఉంటుందని అభిమానులు చెబుతున్నారు.మెగా డాటర్ నిహారిక జనసేన( Janasena ) తరపున ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారని సమాచారం అందుతోంది.