NTR Rejected Movies : ఎన్టీయార్ రిజెక్ట్ చేసిన సినిమాలను చేసి స్టార్లు గా మారిన ముగ్గురు హీరోలు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్( NTR ) చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక తాతకు తగ్గ మనవడుగా కూడా పేరు సంపాదించుకున్నాడు.

 These Are The Three Heroes Who Became Stars After Doing Films Rejected By Ntr-TeluguStop.com

ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని తన మోస్తున్నాడనే చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మొదటి నుంచి చాలా సినిమాలను వదిలేశాడు.

సరైన జడ్జిమెంట్ చేయలేక ఆ సినిమా తనకు సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వదిలేశాడు.అందులో కొన్ని సినిమాలను చేసిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలు గుర్తింపు పొందారు.మొదటగా వినాయక్ దర్శకత్వం లో వచ్చిన దిల్ సినిమా( Dil Movie ) స్టోరీ ఎన్టీఆర్ వద్దకు వస్తే అది తనకు సెట్ అవ్వదని ఎన్టీయార్ దాన్ని రిజెక్ట్ చేశాడు.ఆ సినిమాని చేసిన నితిన్( Nithiin ) స్టార్ హీరోగా ఎదిగాడు.

 These Are The Three Heroes Who Became Stars After Doing Films Rejected By Ntr-N-TeluguStop.com

ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమాను( Bhadra Movie ) కూడా ఎన్టీఆర్ చేయాల్సింది.కానీ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాను చేసిన రవితేజ( Raviteja ) స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక సుకుమార్ దర్శకత్వం వచ్చిన ఆర్య సినిమా( Arya Movie ) కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది.కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు.దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్( Allu Arjun ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.

ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.ఆ సినిమాలను ఎన్టీయార్ చేసి ఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేదని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube