సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు రామ్ చరణ్( Ram Charan ) ఒకరు మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్( Global Star ) అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్ ఏ విధమైనటువంటి తన తండ్రి సహాయ సహకారాలు లేకుండా అద్భుతమైన సినిమా అవకాశాలను అందుకొంటూ ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడు అనే గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇటీవల రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో రామ్ చరణ్ నటించినటువంటి RRR సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ కు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు, విపరీతమైనటువంటి అభిమానులు కూడా పెరిగిపోయారు.ఇక ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ కావడంతో రామ్ చరణ్ చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు( Uppena Director Buchibabu ) దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కీలక అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఎవరు నటించబోతున్నారనే విషయం గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్( Actress Janhvi Kapoor ) నటించబోతున్నారని విషయం తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అప్పట్లో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చి సక్సెస్ అందుకున్న విధంగా వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా సక్సెస్ అవ్వాలని అందరూ భావిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బ్యాడ్ సెంటిమెంటు వెంటాడుతుంది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు.
మరి రామ్ చరణ్ సినిమాకు ఉన్నటువంటి ఆ బాడ్ సెంటిమెంట్ ఏంటి అనే విషయానికి వస్తే ఇటీవల పాన్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ సరసన నటి కృతి సనన్( Actress kriti Sanon ) హీరోయిన్ గా ఆది పురుష్ సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఇక ఈమె ప్రభాస్ తో మాత్రమే కాకుండా గతంలో కూడా టాలీవుడ్లో నటించిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ అంటూ భావిస్తూ ఉంటారు.ఈ క్రమంలోని ఈమె రామ్ చరణ్ సినిమాలో నటించబోతున్నారని విషయం తెలిసి అందరూ మరోసారి ఈ బ్యాడ్ సెంటిమెంట్( Bad Sentiment ) ఎక్కడ రిపీట్ అవుతుందోనని కంగారు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ కృతి సనన్ ఈ సినిమాలో నటించి తన సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయింది అంటే పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి రామ్ చరణ్ ఇమేజ్ కాస్త డామేజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.