Pallavi Prashanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్.. వాళ్లకు లక్ష రూపాయల సాయం చేయడంతో?

తెలుగులో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) ముగిసిన విషయం తెలిసిందే.కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత( Pallavi Prashanth ) సీజన్ విన్నర్ గా నిలిచారు.కాగా రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానంటూ స్టేజ్ పై, హౌస్ లో తెలిపిన విషయం తెలిసిందే.అయితే బిగ్ బాస్ షో ముగిసి మూడు నెలల కావస్తున్నా కూడా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి.

 Bigg Boss 7 Fame Pallavi Prashanth Helps Poor Farmer Children Gajwel-TeluguStop.com

షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని, వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు అంటూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు.ఫైనల్‌గా ఇ‍న్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు.తొలి సాయం చేశాడు.

షోలో ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు( Poor Farmers ) సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది.అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.

గజ్వేల్‪‌లోని( Gajwel ) కొలుగురూ గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు.

తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు.ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్( Sandeep Master ) రూ.25 వేలు సాయం చేయడం విశేషం.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంత ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.బిగ్ బాస్ తర్వాత ఇన్ని రోజులకు ఒక మంచి పని చేశావు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube