జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఆ తప్పు రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
ఇతర నియోజకవర్గాలతో పోల్చి చూస్తే పిఠాపురం సేఫ్ అని పవన్ ఫిక్స్ అయ్యారు.అయితే పిఠాపురం( Pithapuram Constituency ) నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవాలంటే కొన్ని అడ్డంకులు మాత్రం ఉన్నాయని తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలవాలంటే 10 అడ్డంకులను పవన్ కళ్యాణ్ కచ్చితంగా అధిగమించాల్సి ఉంటుంది.పవన్ గెలవాలంటే ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, నేతల( TDP Activists ) నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉండాలి.
వాళ్ల మద్దతు ఉంటే మాత్రమే పవన్ తన లక్ష్యాన్ని సులువుగా సాధించే ఛాన్స్ ఉంటుంది.ఎన్నికలు పూర్తయ్యే వరకు పవన్ వారానికి కనీసం ఒకసారైనా పిఠాపురంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలకు మరింత దగ్గర కావాల్సి ఉంటుంది.

పిఠాపురంలో ఎక్కువ సంఖ్యలో కాపు ఓటర్లు ఉన్నా వాళ్ల ఓట్లన్నీ పవన్ కే పడతాయని కచ్చితంగా చెప్పలేము.అందువల్ల ఇతర కులాల ఓటర్లను సైతం పవన్ ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.పిఠాపురం ప్రజల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ హామీలను ఇస్తే మంచిదని చెప్పవచ్చు.వైసీపీ( YCP ) పవన్ గట్టి పోటీ ఇచ్చే ఏ ఛాన్స్ వదులుకోదు.
ఆ ఛాన్స్ ఇవ్వకుండా పవన్ జాగ్రత్త పడాల్సి ఉంది.పిఠాపురంలో పవన్ నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ దిశానిర్దేశం చేస్తే మంచిది.
బూత్ లెవెల్ స్థాయి నుంచి పిఠాపురంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.గాజువాక, భీమవరంలో( Bhimavaram ) ఓటమికి గల కారణాలను గుర్తించి ఆ కారణాలను విశ్లేషించుకుని ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.

పిఠాపురంలో ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించి వాళ్ల సలహాలు, సూచనలతో పవన్ కళ్యాణ్ ముందడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్ స్థానికంగా నేతలతో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుని ముందడుగులు వేస్తే విజయం సొంతమయ్యే ఛాన్స్ ఉంటుంది.పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా( Pawan Kalyan MLA ) గెలవాల్సిన అవసరం ఉందనే సంగతి తెలిసిందే.







