టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్( venkatesh ) సైంధవ్ సినిమాతో యావరేజ్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కెరీర్ పరంగా బిజీగా ఉన్న వెంకటేశ్ పారితోషికం 10 నుంచి 13 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
సినిమా బడ్జెట్ కు అనుగుణంగా వెంకటేశ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.అయితే స్టార్ హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది.
గతేడాది అక్టోబర్ లో వెంకటేశ్ రెండో కూతురు నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.వెంకటేశ్ రెండో కూతురు పేరు హయవాహి ( Hayavahini )కాగా రామానాయుడు స్టూడియో వేదికగా ఈ శుభకార్యం జరగనుందని తెలుస్తోంది.
ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి వేడుక జరగనున్నట్టు సమాచారం.హయవాహి కాబోయే భర్త డాక్టర్ అని సమాచారం.
వెంకటేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.మార్చి 15వ తేదీన పెళ్లి వేడుక జరగనుండగా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు ఈ వేడుకకు హాజరవుతారో చూడాలి.
సన్నిహితులను మాత్రమే వెంకటేశ్ ఫ్యామిలీ ఈ వివాహ వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.పెళ్లి ఫోటోలు రిలీజైన తర్వాత ఈ వేడుకకు హాజరైన సెలబ్రిటీల గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల ఫ్యామిలీలు వరుసగా పెళ్లికి సంబంధించిన శుభవార్తలు చెబుతున్నాయి.వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత వివాహం 2019 సంవత్సరంలో జరిగింది.
అశ్రిత( Aashritha ) ఫుడ్ వ్లాగర్ కాగా ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వెంకటేశ్ చిన్న కూతురు పేరు భావన కాగా కొడుకు పేరు అర్జున్.వెంకటేశ్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.అర్జున్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.వెంకటేశ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.