నల్లగొండ జిల్లా:వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ – భారత రాష్ట్ర సమితి పార్టీల మధ్య పొత్తు బహుజనులకు లబ్ది చేకూరుస్తుందని బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మునుగోడు శంకరన్న విశ్వాసం వ్యక్తం చేశారు.బుధవారం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డా.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) రాజకీయ చతురతను కొనియాడారు.మా పొత్తును వ్యతిరేకించేవారు రాజకీయ అవగాహన లేనివారైన లేదా చెంచాగిరి చేసే నాయకులైనా అయి ఉండాలని ఎద్దేవా చేశారు.
మా ఉద్యమ వ్యతిరేకులు ఈ పొత్తుతో బీఎస్పీ బలపడుతున్నదని భావించి వారి అక్కసును చిన్న చిన్న ఇంటర్వ్యూల వెళ్లగక్కుతూ హీరోలు అవుదామని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.ఇతర పార్టీల్లో మండల స్థాయిలో పనికిరాని నాయకులు మోసపూరితంగా వచ్చి ఉన్నత పదవులు పొంది అమ్మలాంటి పార్టీని విమర్శిస్తున్నారని,ఇక్కడ బహుజన వాదం మోసి, ఇప్పుడు రెడ్లకు ఊడిగం చేయడానికి ఆ పార్టీలలో చేరారన్నారు.
బహుజనులపై జరుగుతున్న దాడులపై పోరాడుతున్న,ప్రశ్నిస్తున్న ఏకైక నాయకుడు ఆరెస్పీ అన్నారు.
ఆకునూరి మురళి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశాలు పెట్టీ ఉచిత విద్య,వైద్యం కావాలంటే ఎవరూ ఇవ్వరని,రాజకీయ వాటా ద్వారానే సాధ్యమని అన్నారని,దమ్ముంటే మీరు చెప్పిన బడ్జెట్ ను రేవంత్ రెడ్డి( Revanth Reddy )తో కేటాయించగలరా అని సవాల్ విసిరారు.
రాజ్యాధికారాన్ని కాంక్షించే విషారదన్ ఈ పొత్తును విమర్శించటం హాస్యాస్పదమన్నారు.ప్రతీ సభకు వెంట తిప్పుకున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ మీ అభ్యర్థులకు ఎన్ని బీసీ ఓట్లు వేయించారో చెప్పాలన్నారు.
మాన్యవర్ కాన్షిరామ్ నిజమైన వారసులుగా మేము రాజ్యాధికారం సాధిస్తామని, మీరు కేవలం సంఘాలకు పరిమితం కాకుండా మాతో కలసిరండని విజ్ఞప్తి చేశారు.చివరగా మా అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తులో భాగంగా ఎవరికి సీటు ఇచ్చినా మునుగోడు బహుజన సైన్యం పనిచేసి అభ్యర్ధి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో మరో ఇంఛార్జి ఏర్పులా అర్జున్,అధ్యక్షుడు సామ్రాట్ కిరణ్,కార్యదర్శులు మాణిక్యం,అన్నేపాక శంకర్, మండల అధ్యక్షుడు విజేందర్, మల్లేష్,పూడరీ ధనుంజయ్, సీనియర్ నాయకులు నేరెళ్ల ప్రభుదాస్,అంజన్ కుమార్, వంటేపాక ప్రసాద్,పుదరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.