సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నటువంటి వారిలో ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యులు వేణు స్వామి ( Venu Swamy ) ఒకరు.ఈయన గత కొంతకాలంగా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చూపుతూ వార్తలలో నిలుస్తున్నారు.
ఇక ఈయన పలువురు సెలబ్రిటీలు జాతకాలను చెప్పడమే కాకుండా జాతక పరిహారాలను కూడా చేయడంతో మంచి సక్సెస్ అందుకుంటారని భావిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది వేణు స్వామి చేత జాతకాలు చెప్పించుకోవడమే కాకుండా కెరియర్ పరంగా సక్సెస్ అవ్వడం కోసం ఈయన చేత ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలాంటి జాబితాలో స్టార్ హీరోయిన్ రష్మిక ( Rashmika ) కూడా ఉన్నారు.రష్మిక పూజలు చేయించుకున్న తర్వాతనే ఆమెకు స్టార్ డం వచ్చిందని తెలుస్తుంది.
మరి కొంత మంది హీరోయిన్లు కూడా వస్తారు.అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా వేణు స్వామిని కలిశారు.
దీంతో ఈమె కలవడం వెనుక కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

మల్లేశం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనన్య నాగళ్ళ( Ananya Nagalla ).ఈమె హీరోయిన్ గా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాల్లో కూడా సందడి చేశారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి అనన్య త్వరలోనే తంత్ర( Tantra ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదలవుతుంది.ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వేణు స్వామిని కలవడంతో ఈయనని కలవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ అవ్వడం కోసమే ఈమె వేణు స్వామిని కలిసి తన చేత పూజలు చేయించారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.







