శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో, న్యూయార్క్‌లలో కార్యాలయాలతో మల్టీ స్టేజ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘‘గ్లోబల్ సిలికాన్ వ్యాలీ’’ (జీఎస్‌వీ)ని స్థాపించిన ముగ్గురు భారతీయ అమెరికన్ మహిళలు 2024 సంవత్సరానికి గాను ‘‘పవర్ ఆఫ్ ఉమెన్ అవార్డు’’ను అందుకోనున్నారు.బిజల్ షా, అనుపమ వైద్ , షాలినీ శర్మ ( Bijal Shah, Anupama Vaid, Shalini Sharma )అనే ముగ్గురు భారత సంతతి మహిళలు 2024లో 14 మంది అచీవర్స్ లిస్ట్‌లో వున్నారు.
వీరిలో సీఈవోలు, అధ్యక్షులు, వ్యవస్ధాపకులు వున్నారు.ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో జరిగే ఏఎస్‌యూ ప్లస్ జీఎస్‌వీ సమ్మిట్ 2024లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
బిజల్ షా ప్రస్తుతం గిల్డ్ ( Guild )తాత్కాలిక సీఈవోగా వున్నారు.ఇది క్యూరేటెడ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రోగ్రామ్‌లు, కెరీర్ అసిస్టెన్స్‌ని అందిస్తుంది.నైపుణ్యం, కెరీర్ మొబిలిటీతో పనిచేసే పెద్దలకు సహాయం చేస్తుంది.గిల్డ్ .వాల్‌మార్ట్, డిస్కవర్, హిల్టన్, టార్గెట్, ది వాల్ట్ డిస్నీ కంపెనీ, ప్రొవిడెన్స్ హెల్త్, యుచెల్త్ వంటి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలతో కలిసి పనిచేస్తోంది.గిల్డ్‌లో చేరడానికి ముందు ఇబోట్టా, వీసాలో కార్పోరేట్ స్ట్రాటజీలో( Ibotta, Visa ) ఎగ్జిక్యూటివ్ , నాయకత్వ పాత్రలను బిజల్ షా నిర్వహించారు.
అనుపమ వైద్ పేరెంట్ స్క్వేర్‌లో( Anupama Vaid Parent Square ) ప్రెసిడెంట్, స్థాపకురాలు.ఇది పాఠశాలలు, తల్లిదండ్రులకు సమాచారం అందించడానికి , పిల్లల అభ్యాసంలో చురుకుగా పాల్గొనడానికి సహాయపడే ఒక ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ సిస్టమ్.షాలినీ శర్మ.లాభాపేక్ష లేని ఎడ్యుకేషన్ సాఫ్ట్‌వేర్ సంస్థ అయిన Zearn సీఈవో, కో ఫౌండర్.2012లో ఆమె ‘‘ Zearn Math ’’ను ప్రారంభించారు.ప్రాథమిక విద్యార్ధులకు చిత్రాలు, నమూనాలు, నిజ జీవిత ఉదాహరణల ద్వారా గణిత శాస్త్ర భావనలను అర్ధం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
కాగా.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలో నలుగురు భారత సంతతి మహిళా ప్రముఖులను ఘనంగా సత్కరించారు.న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహారాణి రాధికారాజే గైక్వాడ్, నీనా సింగ్, డాక్టర్ ఇందు లెవ్, మేఘా దేశాయ్‌లను సన్మానించారు.న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్, ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ డాక్టర్ అవినాష్ గుప్తాలు శుక్రవారం కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరిని సత్కరించారు.






