Tulipa Shefali : భారత సంతతి దౌత్యవేత్త షెఫాలీ దుగ్గల్‌కు అరుదైన గౌరవం.. తులిప్ పువ్వుకు ఆమె పేరు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని లింగ సమానత్వం కోసం వాదించినందుకు నెదర్లాండ్స్‌లోని( Netherlands ) ఒక తులిప్‌కు ఆ దేశంలో అమెరికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న భారతీయ అమెరికన్ దౌత్యవేత్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్( Shefali Razdan Duggal ) పేరు పెట్టారు.‘‘ తులిపా షెఫాలీ’’ని( Tulipa Shefali ) సెయింట్ మార్టెన్‌లోని మావెరిడ్జ్ ఇంటర్నేషనల్ బ్రీడింగ్ ప్రోగ్రాం నుంచి తీసుకున్నారు.

 Tulip Named After Indian American Diplomat Shefali Razdan Duggal In Netherlands-TeluguStop.com

బలమైన , ఆరోగ్యకరమైన తులిప్‌ల కోసం చాలా ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ కొనసాగింది.

తనకు దక్కిన గౌరవంపై 52 ఏళ్ల రజ్దాన్ దుగ్గల్ స్పందిస్తూ.

తులిప్( Tulip ) ఒక అందమైన పువ్వని, ఇది శతాబ్థాలుగా నెదర్లాండ్స్ రాజ్యాన్ని సూచిస్తోందన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం( International Women’s Day ) సందర్భంగా ‘‘షెఫాలీ తులిప్’’ని ఆవిష్కరించడం చాలా సముచితమని ఆమె పేర్కొన్నారు.

ఈ గౌరవాన్ని అందుకున్న తొలి రాయబారి కావడం తనకు దక్కిన గౌరవమన్నారు.చరిత్ర అంతటా మహిళలు, లింగ వివక్షను అధిగమించాల్సి వచ్చిందని.

ప్రతి మైలురాయికి కష్టపడి పనిచేస్తూనే వున్నామని దుగ్గల్ పేర్కొన్నారు.తులిప్ పెంపకం అనేది దీర్ఘకాలిక ప్రయత్నం.

దీని ప్రకారం షెఫాలీ తులిప్‌ మూలం 2009 నాటిది.

Telugu Indianamerican, Netherlands, Joe Biden, Shefalirazdan, Shefali Tulip, Tul

కాగా.నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా షెఫాలీ దుగ్గల్‌ను ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) 2022 మార్చిలో నామినేట్ చేశారు.కాశ్మీర్ నుంచి యూఎస్‌‌కి వలస వచ్చిన దుగ్గల్ సిన్సినాటీ, చికాగో, న్యూయార్క్, బోస్టన్‌లలో పెరిగారు.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన షెఫాలీ( Shefali ) రాజకీయ కార్యకర్త, మహిళా హక్కుల న్యాయవాది, మానవ హక్కుల ప్రచారకర్త అని వైట్‌హౌస్ తెలిపింది.ఆమె యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం కౌన్సిల్‌కు అధ్యక్షురాలిగా పనిచేశారు.ప్రస్తుతం వెస్ట్రన్ రీజినల్ అడ్వైజర్‌‌గా కొనసాగుతున్నారు.హ్యూమన్ రైట్స్ వాచ్ శానిఫ్రాన్సిస్కో కమిటీ, వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ లీడర్‌షిప్ అండ్ క్యారెక్టర్ కౌన్సిల్‌ సభ్యురాలిగా పనిచేశారు.

Telugu Indianamerican, Netherlands, Joe Biden, Shefalirazdan, Shefali Tulip, Tul

న్యూయార్క్ యూనివర్సిటీ( Newyork University ) నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో ఎంఏ .మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ కూడా చదివారు.కాగా.షెఫాలీ పూర్వీకులు నివసించిన జమ్మూకాశ్మీర్ తులిప్ పువ్వులకు ప్రఖ్యాతి గాంచింది.ఇంద్రధనస్సే నేలపైకి వచ్చినట్లుగా వుండే తులిప్ పువ్వులు.భూలోక స్వర్గమైన కాశ్మీర్‌కు మరింత శోభను తెచ్చిపెడుతున్నాయి.

శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దది.ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో తులిప్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

ఈ సీజన్‌లో దేశ, విదేశాల నుంచి పర్యాటకులు కాశ్మీర్‌కు తరలివస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube