వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం( Telangana Cabinet Meeting ) జరగనుంది.సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగబోతోంది.ఈ క్యాబినెట్ లో 6 గ్యారంటీ ల అమలుపైన ప్రధానంగా చర్చించునున్నారు.
ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను అమలు చేసిన నేపథ్యంలో, వాటి అమలు తీరు ఏ విధంగా జరుగుతుంది, లోటుపాట్లు వంటి అన్ని విషయాల పైన చర్చించనున్నారు.అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ పైన ప్రధానంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
వీటితో పాటు అనేక కీలక అంశాల పైన క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండడంతో, ముందుగానే క్యాబినెట్ సమావేశంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై( Congress Govt ) మరింత నమ్మకం కుదిరేలా, జనాల్లో ఆదరణ పెరిగేలా అనే కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు.లోక్ సభ ఎన్నికలకు ముందుగానే ఈ హామీలను అమలు చేసి జనాల్లోకి వెళ్తే, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడడం ఖాయమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో సత్తా చాటుకుంటేనే కాంగ్రెస్ హై కమాండ్ వద్ద తన పలుకుబడి పెరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి న్యాయస్థానం ఆదేశించిన విధంగా మరోసారి పేర్లను గవర్నర్ కు పంపనన్నారు.దీంతో పాటు 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలతో పాటు, 11 కొత్త బిసి కార్పొరేషన్ ల ఏర్పాటు పైనా క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలుపేర్కొంటున్నాయి.







