తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) తీవ్రంగా మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు.
గతంలో గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ ( KCR )జీవో ఇచ్చారన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే బీసీలకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వెల్లడించారు.లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.