Salman Khan Anant Ambani : అనంత్ అంబానీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సల్మాన్.. మరి ఇంత చీపా అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్?

ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ( Ananth Ambani ) రాధిక మర్చంట్ ( Radhika Merchant ) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు జామ్ నగర్ లో ఘనంగా జరిగాయి వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు ఇంటర్నేషనల్ స్టార్స్ అందరూ కూడా హాజరై సందడి చేశారు.

 Salman Khan Gifted Coustamized Wrist Watch Details Goes Viral-TeluguStop.com

ఇక ఈ పెళ్లి వేడుకలలో బాలీవుడ్ సెలబ్రిటీలు( Bollywood Celebrities ) ఏకంగా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్( Salman Khan ) అనంత్ అంబానీ రాధిక మర్చంట్ కు కానుకలు ఇచ్చారని తెలుస్తుంది.అయితే ఈయన ఇచ్చినటువంటి కానుకలపై నేటిజన్స్ విభిన్న రకాలుగా ట్రోల్ చేస్తున్నారు.అనంత్ అంబానీకి వాచెస్ ( Wrist Watch ) అంటే చాలా ఇష్టమని తెలిసినటువంటి సల్మాన్ ఖాన్ ఆయనకు ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఈ పెళ్లి వేడుకలలో అనంత్ ఏకంగా 14 కోట్ల రూపాయల వాచ్( 14 Crore Rupees Watch ) కట్టారు.ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.

ఇక అనంత్ అంబానీకి మాత్రమే కాకుండా రాధిక మర్చంట్ కి సైతం ఈయన డైమండ్ చైన్( Diamond Chain ) కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.ఇక ఈ విషయంపై నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.14 కోట్ల రూపాయల విలువ చేసే వాచ్ కట్టుకున్నటువంటి అనంత్ కి ఇలా చీప్ గా కోటి రూపాయలు వాచ్ ఇవ్వడం ఏంటి సల్మాన్ ఖాన్ అంటూ ఈయన ఇచ్చినటువంటి కానుకలపై కామెంట్ చేస్తున్నారు అయితే గిఫ్టులు అనేవి ప్రేమతో ఇస్తారు కానీ చూసి ఇవ్వరని మరికొందరు ఈ విషయంపై సల్మాన్ ఖాన్ కి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube