మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి త్వరలోనే మరో అద్భుతమైన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష ( Trisha ) నటించబోతోంది.

చిరంజీవి త్రిష కాంబినేషన్లు ఇదివరకే స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది.ఇలా 18 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ జంట ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి త్రిషకు చిరంజీవి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ( Surprise Gift ) ఇచ్చారట.ఈ విషయాన్ని స్వయంగా త్రిష సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక మగ్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.
మగ్గే కదా ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అని అనుకోవచ్చు ఇది మాత్రం చాలా ప్రత్యేకతలు కలిగి ఉందని తెలుస్తోంది.ఈ మగ్ త్రిష బాడీ టెంపరేచర్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తుందట.
ఇక దీని ధర సుమారు 35 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.ఇక ఇదే విషయాన్ని త్రిష తెలియజేస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఒక లెజెండరీ నటుడు తనకు ఇలాంటి కానుక ఇవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈమె తెలిపారు.







