వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.
అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు( Indian Restaurants ) పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.
అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.
ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు దానికి ఎవరైనా ఫ్యాన్స్‌గా మారాల్సిందే.

మనదేశంలోని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్( Famous Street Food ) ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందుతోంది.ఆలూ సమోసా, పానీపురీ, పకోడా, మిర్చిబజ్జీ, పునుగులు, గుంత పుంగనాలు, మసాలా వడలు ఇలా ఎన్నెన్నో.వీటిలో ఒకటి వడపావ్.
( Vada Pav ) మహారాష్ట్రకే ప్రత్యేకమైన ఈ వంటకం భారతదేశంలోని అన్ని నగరాల్లో దొరుకుతుంది.నోరూరించే ఈ వడపావ్ అంటే ఇష్టపడనివారు వుంటారా.? ఈ రుచిని, అనుభూతిని ఆస్వాదించనివారు ఉంటారా.? తాజాగా వడపావ్‌కి ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది.ప్రపంచంలోని టాప్ శాండ్‌విచ్‌లలో స్థానాన్ని దక్కించుకుంది.ముంబైలోని( Mumbai ) సందడిగా వుండే వీధుల నుంచి ఉద్భవించిన ఈ ట్రీట్ నెమ్మదిగా ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది.పావ్ అని పిలిచే మెత్తని బ్రెడ్ బన్‌లో నిక్షిప్తం చేయబడిన మసాలా బంగాళాదుంపలతో తయారు చేయబడిన డీప్ ఫ్రైడ్ వడను కలిగి వుంటుంది.పొడి వెల్లుల్లి , వివిధ చట్నీలతో కలిపి దీనిని ఆరగిస్తే ఆ మజానే వేరు.

వడా పావ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ‘‘ TasteAtlas ’’ కారణంగా వచ్చింది.ఇది ప్రఖ్యాత ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్.ఇది ఇటీవల ‘‘ Best Sandwiches in the World ’’ జాబితాను ఆవిష్కరించింది.మార్చి 2024 నాటికి ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో నిలిచింది వడా పావ్ .టేస్ట్ అట్లాస్ ప్రకారం.ఈ ఐకానిక్ స్ట్రీట్ ఫుడ్ మూలాలు అశోక్ వైద్య( Ashok Vaidya ) అనే వ్యక్తితో ప్రారంభమయ్యాయి.
ఆయన 1960, 70 దశకాలలో దాదార్ రైల్వే స్టేషన్ సమీపంలో తన వ్యాపారాన్ని కొనసాగించాడు.ఆకలితో వున్న కార్మికులకు సంతృప్తికరమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో వడపావ్‌ను రూపొందించాడు వైద్య.
సులభంగా చేతితో తీసుకెళ్లడం, తయారీ సౌలభ్యాల కారణంగా వడపావ్ అనతికాలంలోనే ముంబై అంతటా గుర్తింపు తెచ్చుకుంది.







