Mudragada Padmanabham : నమస్కారములండి .. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానండి 

” గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) శిరస్సు వంచి నమస్కారములండి.ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి.

 After Greetings I Have Decided To Join Ycp-TeluguStop.com

గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్సార్ సిపిలోకి( YSRCP ) వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి.మరల వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి.

వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు,  వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలనే ఆశతో ఉన్నానండి.  మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి చేయను కూడా.14.3 .2024న వైఎస్సార్ సీపీ లోకి చేరుటకు ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి.  మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి ”.

Telugu Ap, Jagan, Janasena, Kirlampudi, Tdpjanasena, Ysrcp-Politics

అంటూ కాపు ఉద్యమ నేత , మాజీమత్రి ముద్రగడ పద్మనాభం ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు.గత కొంతకాలంగా ముద్రగడ రాజకీయ ప్రయాణం పై అనేక వార్తలు వచ్చాయి .జనసేనలో చేరబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది .స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని అంత భావించారు.అయినా పవన్ ఈ విషయంలో స్పందించకపోవడంతో ముద్రగడ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఇప్పటికే ముద్రగడ ను పార్టీలోకి రావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ( MP Mithun Reddy )ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో ఈ విషయంపై చర్చించారు.

Telugu Ap, Jagan, Janasena, Kirlampudi, Tdpjanasena, Ysrcp-Politics

ఈ క్రమంలోనే ఈనెల 14న వైసీపీలో ముద్రగడ చేరబోతున్నారు.ఈనెల 14న ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లి కి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతారు.కిర్లంపూడి లో బయలుదేరి ప్రత్తిపాడు,  జగ్గంపేట , లాలాచెరువు , వేమగిరి,  రావులపాలెం,  తణుకు , తాడేపల్లిగూడెం , ఏలూరు మీదుగా విజయవాడ కు వెళ్లి అక్కడ నుంచి తాడేపల్లికి భారీ కాన్వాయ్ తో ముద్రగడ వెళ్లనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube