ఢిల్లీ వేదికగా టిడిపి, బిజెపిలో( TDP BJP Alliance ) మధ్య పొత్తు వ్యవహారం ఒక క్లారిటీకి వచ్చింది .ఎన్డీఏలో టిడిపి చేరబోతోంది.
టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా బిజెపి కోరిన సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లుగా ప్రచారం జరిగింది.ఈ రోజు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది.
ఈ మేరకు బిజెపి ఉమ్మడిగా ప్రకటన చేయబోతోంది.ఈ మేరకు టిడిపి, జనసేన, బిజెపి తొలి ఉమ్మడి సమావేశం విజయవాడలో జరగనుంది.
నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో( Pawan Kalyan ) బిజెపి కేంద్ర బృందం భేటీ అయింది.
గజేందర్ సింగ్ షకావత్ , జయంత్ పాండా, శివ ప్రకాష్ చర్చలు జరిపారు.
నేడు మూడు పార్టీల సమావేశం లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పాల్గొనడంతో సర్దుబాటుపై ఒక క్లారిటీ రాబోతోంది.ఇప్పటికే బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు.
పొత్తులో భాగంగా బిజెపి, జనసేనకు ఎనిమిది ఎంపీ , 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టిడిపితో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చింది.
అసెంబ్లీ స్థానాల పైన దృష్టి పెట్టింది.

అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ స్థానాలకే బిజెపి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ,( AP BJP Chief Purandeshwari ) సంఘటన్ కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో బిజెపి నేతలు ప్రత్యేకంగా దీనిపై కసరత్తు చేయనున్నారు.పొత్తుల భాగంగా బిజెపికి ఆరు ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ మేరకు బిజెపికి కేటాయించ బోయే నియోజకవర్గాలు , అభ్యర్థులు వీరేనంటూ ప్రచారం జరుగుతోంది.

అరకు కొత్తపల్లి గీత , రాజమండ్రి పురందరేశ్వరి, నరసాపురం రఘురామకృష్ణంరాజు లేదా నరేంద్ర వర్మ, తిరుపతి రత్నప్రభ లేదా నిహారిక, హిందూపురం సత్య కుమర్, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, అనకాపల్లి, ఏలూరు పై క్లారిటీ రావాల్సి ఉంది.అసెంబ్లీ స్థానాలు విషయానికి వస్తే విశాఖ నార్త్, పి గన్నవరం ,కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె లేదా గుంటూరు , నంద్యాల అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.







