ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ టీం( Team india ) హవా నడుస్తుంది.మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ పొజిషన్ లో ఇండియన్ టీం కొనసాగుతుంది.
ఇక రీసెంట్ గా ఇంగ్లాండ్ తో ఆడిన ఐదు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న ఇండియా టీం ప్రస్తుతం 122 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక రెండోవ స్థానంలో ఆస్ట్రేలియా, మూడోవ స్థానంలో ఇంగ్లాండ్ టీమ్ కొనసాగుతుంది.
అయితే ఇది ఇలా ఉంటే మొన్నటిదాకా ఆస్ట్రేలియా టీమ్ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగింది.
అయినప్పటికీ ఇండియా తన అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ టీం గా కొనసాగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్( World Test Cricket Championship ) (డబ్ల్యుటిసి) సాధించడం కోసం ఇండియన్ టీం చాలా కసరత్తులను చేస్తుంది.
అయితే ఇప్పటికే రెండుసార్లు డబ్ల్యుటిసి ఫైనల్ కి వెళ్లిన ఇండియన్ టీమ్ రెండు సార్లు రన్నరప్ గానే మిగిలిపోయింది.మొదటిసారి న్యూజిలాండ్ మీద ఇంకోసారి ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది.
ఇక దాంతో ఇండియన్ క్రికెట్ అభిమానులందరికీ తీవ్రమైన బాధను కలిగించిందనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే ఇండియన్ టీమ్ వరుసగా డబ్ల్యుటిసి మ్యాచ్ లో కూడా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక్కడ డబ్ల్యూటిసి ఫైనల్ కి అర్హత సాధించాలంటే ఇండియన్ టీం దగ్గర కేవలం ఐదు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.ఇక అందులో భాగంగానే బంగ్లాదేశ్( Bangladesh ) తో రెండు టెస్ట్ మ్యాచ్ లు, న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ లతో కూడిన ఒక సిరీస్ ని ఆడడానికి రెడీగా ఉంది.
ఇక వీటిలో ఎలాగైనా సరే విజయాన్ని సాధించి ఈసారి డబ్ల్యూటీసి ఫైనల్ కీ వెళ్లి కప్పు గెలవాలనే ఆసక్తితో ఎదురుచూస్తుంది… ఇక దానికి తగ్గట్టుగానే ఇండియా టీంలో కూడా చాలామంది యంగ్ ప్లేయర్స్ మంచి ప్రతిభను కనబరుస్తు టీమ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
.