Kajal Aggarwal , Gautham Kitchlu : కాజల్ గౌతమ్ ను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా.. మామూలు ఐడియా కాదుగా?

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

 Kajal Aggarwal Secret Behind Marrying Gautham Kichlu-TeluguStop.com

తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం అయినటువంటి కాజల్ అనంతరం మగధీర చందమామ వంటి వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూ తెలుగు తమిళ హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీ అయ్యారు.

ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో వారి గురించి ఎన్నో రకాల వార్తలు రావడం సర్వసాధారణం.పలానా హీరోయిన్ ఆ హీరో తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి.

అయితే కాజల్ అగర్వాల్ గురించి కూడా ఇలాంటి రూమర్స్ భారీగా వచ్చాయి.ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోతో పీకల్లోతో ప్రేమలో పడింది అంటూ ఆ హీరోనే పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.

Telugu Bollywood, Gautham Kichlu, Kajal Aggarwal, Kajalaggarwal, Kajal, Tollywoo

ఇలా కాజల్ అగర్వాల్ గురించి వచ్చినటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ ఈమె మాత్రం ఇండస్ట్రీకి చెందినటువంటి వారిని కాకుండా తన స్నేహితుడు అయినటువంటి గౌతమ్ కిచ్లు ( Gautham Kitchlu ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఇలా వీరి వైవాహిక జీవితం తర్వాత వెంటనే ఒక బాబుకి కూడా జన్మనిచ్చి ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో తిరిగి బిజీ అయ్యారు.ఇలా కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే మరోవైపు కుటుంబ బాధ్యతలు అన్ని చక్క దిద్దుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Bollywood, Gautham Kichlu, Kajal Aggarwal, Kajalaggarwal, Kajal, Tollywoo

తాజాగా ఈమె గౌతమ్ ను పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తోంది .ఈమె తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వెనుక కారణం లేకపోలేదట.సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలను పెళ్లి చేసుకోవడానికి కాజల్ భయపడ్డారట హీరోలు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందుకే సినిమా హీరోలను పెళ్లి చేసుకోవడానికి ఈమె వెనకడుగు వేశారని తెలుస్తుంది.ఇక చిన్నప్పటినుంచి తనకు ఎంతో పరిచయం ఉన్నటువంటి తన స్నేహితుడికి ఏ విధమైనటువంటి అలవాట్లు లేవు తన వ్యక్తిత్వం కూడా ఎంతో మంచిది తనతో తన జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని భావించినటువంటి కాజల్ తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.

ఇలా తనని ఇష్టపడినటువంటి వారిని అర్థం చేసుకున్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటే ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవని గ్రహించినటువంటి కాజల్ గౌతమ్ ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు.ఇక ఈ విషయం తెలిసి అమ్మో కాజల్ తెలివితేటలు మామూలుగా లేవు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube