ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు.ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ సినిమా 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

ఇక ఈ సినిమా విషయాన్నీ పక్కన పెడితే ప్రభాస్ హీరోగా అంతకు ముందు వచ్చిన సాహో, రాధే శ్యామ్ లాంటి సినిమాలు కూడా భారీ వసూళ్లను రాబట్టాయి.ఇక ఆయన సినిమా ప్లాప్ అయినా కూడా భారీ వసూళ్లను సంపాదిస్తున్నాయనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్( Nag Ashwin) డైరెక్షన్ లో కల్కి అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ప్రభాస్ చేసిన ప్రతి సినిమా మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటుంది.

దాంతో ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడని అందరిలో మంచి అంచణలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద నాగ్ అశ్విన్ కూడా భారీ అంచనాలైతే పెంచుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ముందు ఈ సినిమాకి సంభందించిన సెటప్ ఉంటుందంట.
అందులో ఒక్కొక్క క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారట… ఇక ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చే సమయానికి మాత్రం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు అని సినిమా యూనిట్ నుంచి సమాచారం అయితే వస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో దీపిక పదుకునే, అమితాబచ్చన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు…
.







