కొంతమంది అప్పటివరకు మనతోనే ఉండే ఉంటారు లేదా.ఒకటి లేదా రెండు రోజులు ముందే బాగా మాట్లాడించి ఉంటారు.
అలా ఉన్నవారు సడన్ గా మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.మరికొందరైతే చుట్టుపక్కల ఎంతోమంది ఉన్న అప్పటి వరకు సంతోషంగా ఉన్న మనిషి కూడా క్షణకాలంలో పరలోకానికి చేరిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో ( social media )చాలానే చూసాం.
తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది.అయితే ఈ సంఘటన విద్యార్థికి జరగడంతో నిజంగా బాధాకరం.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో ఓ హృదయ విధాత సంఘటన జరిగింది.నగరంలోని హాన్స్ వాహిని పాఠశాలలో చదువుతున్న చంద్రకాంత్( Chandrakanth ) అనే విద్యార్థి రెండో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు.అయితే విద్యార్థులు అందరూ వారి స్కూల్లో ఆడుకుంటున్న సమయంలో చంద్రకాంత్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.
దాంతో అతని చుట్టూ ఉన్న తన తోటి విద్యార్థులు అందరూ ఆ అబ్బాయిని లేపడానికి ఎంతగానో ప్రయత్నించారు.అబ్బాయి లేయకపోవడంతో వారు వారి ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేశారు.
ఉపాధ్యాయులు విద్యార్థి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే విద్యార్థిని పరిశీలించిన డాక్టర్లు ఆ విద్యార్థి స్కూల్లోనే హార్ట్ ఎటాక్ ( Heart attack )రావడంతో అక్కడికక్కడే మరణించినట్లు తేల్చారు.ప్రస్తుతం విద్యార్థి అకస్మాత్తుగా పడిపోయిన సంఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారండి.ఏదేమైనా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఎవరికి ఎలా క్షణాల్లో ప్రాణం పోతుందో అర్థం కాని పరిస్థితిలు ఏర్పడ్డాయి.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హృదయ విధాకర సంఘటన సంబంధించి వీడియో చూసేయండి.







