సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు మూడు రకాలుగా విడదీయబడి ఉంటుంది.మొదటగా వచ్చేది స్టార్ హీరోలైతే రెండవది మీడియం రేంజ్ హీరోలు చివరగా చిన్న హీరోల వంతు.
పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్ వందల కోట్లు పెట్టడానికి నిర్మాతలు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు.ఎందుకంటే ఆ రేంజ్ హీరోల పారితోషకం 100 కోట్లు ఉంటుంది.
ఇక మీడియం రేంజ్ హీరోల విషయానికొస్తే ఆ హీరోల పారితోషకం పాతిక కోట్ల వరకు ఉండి ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లకు పైగానే ఉంటుంది.చిన్న హీరోలు పది కోట్లలోపే బడ్జెట్ తో సహా పారితోషకాన్ని సర్దుకోవాల్సి వస్తుంది.
అయితే చిన్న హీరోలకి పెద్ద హీరోలకి పెద్దగా సమస్యలేమీ లేవు.ఎవరి పరిధిలో వారు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.
ఎటొచ్చి మీడియం రేంజ్ హీరోలకి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి.

పెద్ద హీరోల సినిమాలకు ఓటిటి ( Ott )ముందే ఎంత అంటే అంత బడ్జెట్ పెడుతూ పది రోజులు తిరగక ముందే విడుదల చేసుకుంటుంది.అయితే మీడియం రేంజ్ హీరోల విషయానికొచ్చేసరికి వారి సినిమా ఎటు వెళుతుందో తెలియదు కాబట్టి విడుదలయ్యాకే డబ్బులు ఇస్తామంటున్నారు ఓటిటి.అందుకే నిర్మాతలు సైతం వారిపై డబ్బులు పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదు.
ఇంతకు ముందు ఎంత పారితోషకం అడిగినా ఇచ్చిన నిర్మాతలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.హిట్టు కొట్టినా కూడా వారికి సరైన సినిమాలు పడటం లేదు.అలాగే నిర్మాతలకు ఆసక్తి కూడా లేదు అని తెలుస్తోంది.

ముఖ్యంగా రామ్ స్కంద సినిమా( Skanda )తో డిజాస్టర్ చూస్తే విజయ్ దేవరకొండ ఖుషి వంటి సినిమాలతో పర్వాలేదనిపిస్తున్నాడు.వరుణ్ తేజ్ కూడా ఆల్మోస్ట్ ప్లాప్ చిత్రాలనే తీస్తూ వస్తున్నాడు.నాగచైతన్య( Naga Chaitanya ) సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.
నాని వీరిలో కాస్త మెరుగ్గా ఉన్నా కూడా ఓటిటి విషయానికి వచ్చేసరికి ఈ హీరోలలో ఖచ్చితంగా ముందు ఉన్నాడు.అయితే మిగత హీరోలకు మాత్రం ఓటిటి కోట్ల కొద్ది ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.
అందుకే కేవలం థియేటర్లో సినిమా విడుదలయితే కాసుల వర్షం కురిపించడం ఎంత వరకు అనే భయం నిర్మాతల్లో మొదలయ్యింది.ఇదే విధంగా కొనసాగితే మీడియం రేంజ్ హీరోల పరిస్థితి ఇంకా అద్వానంగా ఉండే అవకాశం ఉంటుంది.







