ఎప్పటి నుంచో బిజెపితో పొత్తు పెట్టుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని , దానికి అనుగుణంగానే వ్యూహాలు రూపొందించుకుని ,ఆ టార్గెట్ ను చేరుకోవడంలో సక్సెస్ అయ్యారు టిడిపి అధినేత చంద్రబాబు.బిజెపి, జనసేన( BJP, Jana Sena ) పొత్తు పెట్టుకుని కలిసే ఉన్నా.
ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు .బీజేపీనీ పక్కనపెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు టిడిపి తో పొత్తుకు బిజెపి అగ్ర నేతలను ఒప్పించేందుకు పవన్ అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారు.ఇక చంద్రబాబు అనేకసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో చర్చలూ జరిపారు.

టిడిపి ,జనసేన, బిజెపి కలిస్తే తిరుగు ఉండదని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని లెక్కలతో సహా వివరించి బిజెపి పెద్దలను ఎట్టకేలకు పొత్తుకు ఒప్పించగలిగారు.ఇక సీట్ల పంపకాలే జరగాల్సి ఉంది.ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు అంశంపై టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందనను తెలియజేశారు .మళ్ళీ ఏపీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు టిడిపి ,జనసేన , బిజెపి అనే మూడు శక్తులు ఏకమయ్యాయి అని, చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత ఐదేళ్లుగా చీకటిలో మగ్గిపోయిన రాష్ట్రానికి ఈ పొత్తు ఒక ముఖ్యమైన ఘట్టం అని లోకేష్ అన్నారు.

ఈ పొత్తు చరిత్రలో నిలిచిపోతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితకు , ప్రజల జీవితాలకు ఇదొక సానుకూల మేలి మలుపు అంటూ లోకేష్ స్పందించారు. ఇదే విషయమై టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) స్పందించారు.ఎన్డీఏలు చేరడం తనకు చాలా సంతోషం కలిగిస్తుందని, ఏపీకి దేశానికి సేవ చేసేందుకు టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చంద్రబాబు అన్నారు .ఏపీలో బిజెపి, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు .అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఎదురు చూస్తున్నామని , ఈ కూటమి ప్రజా శ్రేయస్సుకు స్వర్ణ యుగం తెస్తుందనే నమ్మకం తనకు ఉందని బాబు అన్నారు.చారిత్రాత్మకమైన ఈ కూటమిని ప్రజలంతా ఆశీర్వదిస్తారనే విశ్వాసం తనకు ఉందని చంద్రబాబు అన్నారు.







