వచ్చే ఏపీ ఎన్నికల్లో టిడిపి , జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేయడం ఖాయమైంది.ఈ మేరకు మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చింది.
బిజెపి మొన్నటి వరకు టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడలేదు.ఒంటరిగా పోటీ చేసేందుకే మొగ్గుచూపించింది .ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దింపేందుకు సిద్ధమైంది.అయితే టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah )ను కలిసి పొత్తుల అంశంపై చర్చించి, ఎట్టకేలకు బిజెపిని పొత్తుకు ఒప్పించారు.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సోషల్ మీడియా ద్వారా ఈ పొత్తు అంశంపై స్పందించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం( YCP ) చేస్తున్న అరాచకాలను రాబోయే ఎన్నికల్లో మోది నేతృత్వంలోని బిజెపి, టిడిపి, జనసేన కూటమి ముగింపు పలుకునుందని పవన్ వ్యాఖ్యానించారు .దశాబ్ద కాలంగా ఏపీ విభజనలో, అర దశాబ్ద కాలంగా వైసీపీ ప్రభుత్వ విధాన పరమైన తీవ్రవాదం, అవినీతి ,ఇసుక, విలువైన ఖనిజాల వంటి సహజ వనరుల దోపిడి , మద్యం మాఫియాతో రాష్ట్రం అల్లకల్లోలం అయిందని , దేవాలయాలను అపవిత్రం చేయడం టీటీడీని ఏటీఎం గా మార్చారని పవన్ విమర్శించారు.ప్రతిపక్ష నాయకులు , వారి పార్టీ క్యాడర్ పై బలవంతం మరియు భౌతిక దాడులకు పాల్పడ్డారని, న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడం మొదలైన ఆకృత్యాలు కారణంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిన వ్యాపారులు , పారిశ్రామికవేత్తలు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్, 30 వేల మందికి పైగా మహిళల అదృశ్యం , దళితులపై అత్యధిక దౌర్జన్యాలు వంటి ఆకృత్యాలతో , ఏపీలో సామాజిక ,ఆర్థిక ,రాజకీయ గందరగోళం ఏర్పడిందని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.