జుట్టు చిట్లడం.( Hair Breakage ) ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే కేశ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.
జుట్టు చిట్లడానికి చాలా కారణాలే ఉన్నాయి.హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, పోషకాల కొరత, కఠినమైన రసాయనాలు ఉన్న జుట్టు ఉత్పత్తులు వాడటం, బిగుతుగా ఉండే కేశాలంకరణ, తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వడం, కేశ సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.
దీంతో ఎక్కువ శాతం మంది చిట్లిన జుట్టును కట్ చేస్తూ ఉంటారు.
అయితే జుట్టు చిట్లిన ప్రతీసారి కత్తిరించడమే పరిష్కారం కాదు.
పైగా ఇలా ప్రతిసారీ కత్తిరించడం వల్ల మీ జుట్టు పొట్టిగా తయారవుతుంది.అందుకే ఈ సమస్యను సహజంగా ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ మీరు గమనిస్తారు.ఆవనూనె, అలోవెరా జెల్ మరియు నిమ్మరసంలో ఉండే విటమిన్స్, మినరల్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.
చిట్లిన జుట్టును సహజంగానే రిపేర్ చేస్తాయి.కురులను ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి.

ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చిట్లిన జుట్టు సమస్యకు బై బై చెప్పవచ్చు.అలాగే ఈ రెమెడీని పాటించడంతో పాటు హెయిర్ స్టైలింగ్ మరియు హీటింగ్ టూల్స్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండండి.జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మంచి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఐరన్, ఒమేగా-3, జింక్, విటమిన్ సి మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను చేర్చండి.
కఠినమైన రసాయనాలు ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం మానుకోండి.







