జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) బృందం పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిపుణుల కమిటీ చేపట్టిన అన్నారం బ్యారేజీ పరిశీలన ముగిసింది.
దాదాపు మూడున్నర గంటల పాటు అన్నారం బ్యారేజీని కమిటీ సభ్యులు పరిశీలించారు.ఈ క్రమంలోనే బ్యారేజీలోని సీపేజ్ ప్రాంతాన్ని కమిటీ నిశితంగా పరిశీలించింది.
అన్నారం బ్యారేజీ( Annaram barrage ) పరిశీలన పూర్తి కావడం నిపుణుల బృందం సుందిళ్ల బ్యారేజీ వద్దకు బయలుదేరింది.ఈ బ్యారేజీని కూడా పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.







