సూర్యాపేట జిల్లా:140 కోట్లమంది భారతీయులు సగర్వంగా గుండెలకు హత్తుకునే జాతీయజెండాపురుడుపోసుకున్నది ఇక్కడే.ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని ( Suryapet District )నడిగూడెం మండల కేంద్రంలోని రాజావారి కోటలో ఆనాడు ఉద్యోగిగా పని చేసిన పింగళి వెంకయ్య( Pingali Venkayya ) ఈ కోట గదిలోనే జాతీయ జెండాకు రూపకల్పన చేశారు.1947 జూలై 22న జాతీయ జెండాపై రాజ్యాంగ సభలో తీర్మానం ఆమోదించారు.భారతదేశ ఐక్యమత్వానికి సంకేతంగా నిలుస్తున్న జాతీయ పతాకం రూపుదిద్దుకున్న నడిగూడెం మండలంగా మారింది.
కానీ,తదనంతర కాలంలో పాలకుల సవతి తల్లి ప్రేమతో పూర్తిగా వెనుకబడిపోయింది.మండలంగా ఏర్పాటైనా అధికారులు,రాజకీయ నాయకులు మండలంపై ఫోకస్ పెట్టకపోవడంతో హైవేపై ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందాయి.
కానీ, ఒకప్పుడు రాజుల రాజ్యాంగా ఉన్నా నడిగూడెం పరిస్థితి ఇప్పుడు రాళ్లపాలైనట్లుగా మారింది.గత ప్రభుత్వంలో కోదాడ ఎమ్మెల్యే నడిగూడెం మండలానికి చెందినవారైనా అభివృద్ధి చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సరైన విధంగా ప్రణాళికలు చేయడంలో విఫలమయ్యారనిఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి జాతీయ జెండా( National flag ) రూపుదిద్దుకున్న కోటను పర్యాటక కేంద్రంగా మార్చి, మండలాన్ని అభివృద్ధి బాట పట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.